ఆగమనకాల ప్రత్యేకం

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
28 Nov 2026
క్రీస్తు జన్మ దినోత్సవ ఆగమన కాలం!
—————————-----------------
సీ: ఆగమ కాలము ఆఘ మేఘాలపై
అందముగా వచ్చి సందడించె!
పండగే ప్రతిరోజు పండగే అనుకుంటె
ఆనంద మందిర మవును బ్రతుకు !
ఆనంద మూలము ఆ దేవుడైతేను
అంతకు మించిన హాయి లేదు !
అంతరంగికమైన ఆర్భాట ముండాలి
బాహ్యంగ జరుగు సంబరము తోడ!
ఆ.వె: గుండె గుడుల లోన నిండుగా వెలగాలి
ప్రేమ భక్తి జ్యోతి పేర్మి మీర!
ఆగమనపు కాల ఆత్మీయ వెలుగును
పెంచి అందఱకును పంచుదాము!
