About

'భారతమిత్రం' ఇదో తెలుగు కతోలిక పక్ష పత్రిక. మన తెలుగు క్రైస్తవుల ఆధ్యాత్మిక, సామజిక చైతన్యం కోసం 1943వ, సం.లో అప్పటి గుంటూరు కథోలిక పీఠాధిపతులు కీ.శే. మహా ఘన. ముమ్మడి ఇగ్నేషియస్ గారిచే స్థాపించబడింది. ఆపై తెలుగు కతోలిక పీఠాధిపతుల మండలి అధికార సమాచార వేదికగా రూపాంతరం చెందిన భారతమిత్రం పత్రిక, నేటి మన కతోలిక పీఠాధిపతుల యజమాన్యాన క్రీస్తు సందేశానికి అక్షర రూపమిస్తూ, తెలుగు కతోలిక శ్రీసభ సమాచారాన్ని అందిస్తూ, ఆధ్యాత్మిక, సామజిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోంది. చక్కని భావవ్యక్తీకరణ, రచనల పట్ల ఆసక్తి గల కతోలిక రచయితల ప్రోత్సాహక వేదికగా, తెలుగు కతోలిక సాహిత్య అభివృద్ధికి సాధనంగా ప్రపంచ తెలుగు క్రైస్తవ విశ్వాసులకు సేవలందిస్తోంది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రజలు కోరుకునే అత్యుత్తమ, అత్యవసర సేవలను ప్రతికూల సమయంలోనూ మొబైల్ యాప్స్ ద్వారా సులభమైన రీతిలో పొందుచున్న నేపథ్యంలో భారతమిత్రం సేవలను కూడా ఇదే రీతిలో అందించాలనే సదుద్దేశ్యంతో "భారతమిత్రం మొబైల్ యాప్" మీకు అందుబాటులో ఉంచాము. ఇది మీ ఆధ్యాత్మిక అభివృద్దికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం.

నిర్వాహకులు మరియు సిబ్బంది

ఫాదర్ కస్పార్ చాట్ల

ఎడిటర్.

9573879171

ఆఫీస్ 8074821640

editorbm70@gmail.com

editorbm1943@gmail.com


History

కతోలిక పక్షపత్రిక 
''భారతమిత్రం'' చరిత్ర 
క్రైస్తవ పత్రికారంగంలో ఏడు దశాబ్దాలు దాటి మన తెలుగు కతోలికులకు ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలకు ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న పత్రిక మన ''భారతమిత్రం''. 
ఆధ్యాత్మిక రంగంతోపాటు బాధ్యతాయుత వార్తా ప్రసారణంతో క్రైస్తవ విశ్వాస పరిరక్షణలోను, శిక్షణలోను, సువార్త సేవలోను, సామాజిక అవగాహనలోను కతోలికుల, జీవన శైలిని మెరుగుపరచడంలోను ఈ జన పుత్రిక 1925 నుండి సాగించిన ప్రస్తానం నిరుపమానమైనది. 
సమాచార విభాగంలోని కీలక అంశమైన ప్రచురణ లేక ముద్రణా విభాగాన్ని సువార్తా ప్రచారానికి సమృద్ధిగా, చక్కగా వినియోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో నాటి బెజవాడ (నేటి విజయవాడ) ప్రాంతంలో 1897 నుండి 1924 వరకు విస్తృత సేవలందిస్తూ వచ్చిన పూజ్య గురువు సిల్వియో పాస్కాలి (పి.ఐ.ఎం.ఇ) గారి ప్రేరణతో 1925లో ఫా|| మారియో ఎమీలియో మొదయెల్లి (పి.ఐ.ఎం.ఐ) గారి నేతృత్వంలో గుడివాడ నుండి ''వెలుతురు'' అనే పేరుతో 32 పేజీలుగల తొలి కతోలిక మాసపత్రిక వెలువడింది. అప్పట్లో దీని వార్షిక చందా ఒక్క రూపాయి మాత్రమే. అంథవరకు విచారణ కేంద్రంగాయున్న ''వెన్ననపూడి'' నుండి సువార్తా పరిచర్యతోపాటు ''వెలుతురు'' ముద్రణకు అనుకూలంగానుండిన గుడివాడను విచారణ కేంద్రంగా చేసుకొని 1927 వరకు తన పరిచర్య కొనసాగించారు ఫా|| మొదయెల్లి. అతని తర్వాత ఈ ''వెలుతురు'' ప్రచురుణ బాధ్యతలను గుడివాడకు విచారణ గురువులుగా వచ్చిన ఫా|| మిసాని (పి.ఐ.ఎం.ఐ)కి అప్పజెప్పి మిలాన్‌ (ఇటలీ)కి తిరిగివెళ్ళారు. వారు కూడా 1930 వరకు ఈ సేవను కొనసాగించి ఆ తర్వాత అక్కడికి నూతన విచారణ గురువులుగా విచ్చేసిన మోన్సిగ్నోర్‌ అంజెలో బియాంచి (పి.ఐ.ఎం.ఐ) గారి హస్తాల్లోనుంచడం జరిగింది. ఇలా ప్రతిసారి సంపాదకులు మారుతూపోతున్నా పత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రతుల సంఖ్య కూడా పెరుగుతూ పోయింది. ఆ తర్వాత పత్రిక నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన నాటి మోన్సిగ్నోర్‌ డోమినిక్‌ గ్రాస్సి నేతృత్వంలో పత్రిక ప్రాచుర్యం పొంది, మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసించడం మొదలైంది. 1925లో ఫా|| మారియో మొదయెల్లి తొలి ముద్రణ వంద కాపీలు ముద్రించగా, మోన్సిగ్నోర్‌ గ్రాసీగారు ఈ పత్రికా బాధ్యతలు స్వీకరించిన ఒక సంవత్సరానికే పత్రిక సర్కులేషన్‌ వెయ్యి కాపీలకు చేరింది. ఆ రోజుల్లో ''వెలుతురు'' అత్యధిక ప్రతులతో ప్రచురితమయ్యే ఏకైక తెలుగు పత్రికగా పేరుగాంచింది (1932లోనే నెల్లూరు నుండి ఫా|| పి.బాలశౌరి ఆధ్వర్యంలో ఒక్క రూపాయి వార్షిక చందాతో ''క్రీస్తురాజు దూత'' మాసపత్రిక కూడా మొదలైంది). 
ఆ తర్వాత 1939 మే నెలలో మోన్సిగ్నోర్‌ గ్రాస్సీగారు నాటి బెజవాడకు తొలి పీఠాధిపతులుగా నియమితులైనందున పత్రికను బెజవాడకు బదిలీ చేయడం జరిగింది. అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరగడంవల్ల పత్రిక నడవడం కొంత కష్టతరంగా మారింది. 
అందువల్ల రెండవ ప్రపంచయుద్ధం (1939-1945) అనంతరం 1943లో గుంటూరు మేత్రాసన రెండవ పీఠాధిపతులుగా నియమితులైన మహా ఘన|| ముమ్మడి ఇగ్నేషియస్‌ పీఠాధిపతులు ఈ పత్రికా నిర్వహణ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొని, ఐర్లాండు, బెల్జియం నుండి కొందరి దాతల సాయంతో గుంటూరులోని సెయింట్‌ మైఖేల్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించి, అందులోనే ముద్రణాలయాన్ని ఏర్పరచి అంతవరకు బెజవాడలో కొనసాగిన ''వెలుతురు'' పత్రికను 1947లో ''భారతమిత్రం'' అనే నామాంతరం చేయించి, ప్తటకకు పునర్జన్మనిచ్చి పోషించడం మొదలెట్టారు. సమాచార సాధనాలలో ముద్రణా విభాగాన్ని సువార్తా సేవకు సమృద్ధిగా ఉపయోగించుకొంటూ, పత్రిక ప్రతిష్టను పెంచుతూ, ఆధ్యాత్మికతతోపాటు వైవిధ్యంగల అంశాలను ప్రచురిస్తూ, ఎందరో అనుభవజ్ఞులైన సంపాదకుల చేతుల్లో పత్రిక దినదినాభివృద్ధి చెంది 32 ఏండ్లపాటు గుంటూరు నుండే వెలువడంది (ఇదే సమయంలో విజయవాడ నుండి 1964లో ఫా|| లెయెంచిని (పి.ఐ.ఎం.ఐ) సారధ్యంలో ''స్నేహ దూత'' అనే మాస పత్రిక కూడా వెలువడింది). 
పిదప అప్పుడప్పుడే సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించబడ్డ అమృతవాణి కేంద్రానికి 1975లో ''భారతమిత్రం'' నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇలా 1975 నుండి అమృతవాణిలో 15 సం||ల పాటు ''భారతమిత్రం'' వారపత్రికగా వెలువడి, కొనసాగిన తర్వాత అది పక్షపత్రికగా మారింది. 
ఆ తర్వాత 1992లో భారతమిత్రం ప్రచురణ బాధ్యతను ఏలూరు పీఠం స్వీకరించి 2002 వరకు అక్కడ్నించే పత్రిక వెలువడింది. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు ఆర్థిక ఇబ్బందులవల్ల పత్రిక నిర్వహణ నిలిపివేయబడింది. ఆ తర్వాత 2003లో మళ్ళీ ''అమృతవాణి'' నిర్వహణ బాధ్యతలు చేపట్టి కొత్త గెటప్‌లో పుస్తకరూపంలో వెలువడి, ఇంతవరకు నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. 
ఇలా 74 ఏళ్ళ సుదీర్గ పయనంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, ఆర్థిక పెనుతుఫానులకు గురైనా, అవాంతరాలన్నింటిని ఛేదించుకొని, నేడు తెలుగు కతోలికుడి విశ్వాసాన్ని విశ్వానికి తెల్పుటకు నిత్యనిష్టతో అనునిత్యం అక్షరోపాసన చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధించాలనే తపనతో ముందుకు సాగుతోంది మన ''భారతమిత్రం''. కాలగమనంలో ''భారతమిత్రం'' పత్రిక కొట్టుమిట్టాడే ప్రమాద స్థితిలో కూడా ఉదార స్వభావంతో ముందుకు వచ్చిన మతాధిపతులు, గురువులు, విశ్వాసులు అంధించిన కలిమిని, బలిమిని మీ మానస పుత్రిక ''భారతమిత్రం'' ఎన్నడూ మరువజాలదు. మీ బలిమి - కలిమితోనే అశేష తెలుగు క్రైస్తవుల విశ్వాస సముద్ధరణకే వెచ్చించాలనే సత్సంకల్పంతో అడుగు ముందుకు వేస్తుంది మన పత్రిక. 
విశ్వపు నాలుగు చెరగులా వ్యాపించియున్న తెలుగు క్రైస్తవుల్ని విశ్వాసంలో వృద్ధి పొందించడమేకాక, మన కతోలిక జనహితం కోసం ప్రార్థనా జీవితం, కుటుంబ జీవితం, సామాజిక జీవితంతోపాటు నిత్యనూతన వార్తా విశ్లేషణలతో తెలుగు లోగిళ్ళు కళకళలాడాలని అనవరతం తపిస్తూ ''భారతమిత్రం'' తెలుగువారి కతోలిక ఆత్మబంధువుగా, సమాచార సింధువుగా, నిబద్ధతతో కృషి చేస్తోంది.


Vision

Bharathamithram

  • Instructs the faithful on religious, moral, educational, and social values
  • Informs the faithful about the Catholic News and Views
  • Provides articles on faith and personality development
  • Serves as the official voice of APBC and catholic forum
  • Presents catholic identity and generates Catholic opinion in secular society.
  • Caters to all the pastoral needs of A.P Church


Mission

We will enter into all the Catholic families spread throughout Telangana and Andhra Pradesh. We will invite everyone to become a Bharathamithram Family Member.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN