విశ్వాసం సేవా కార్యాల ద్వారా ప్రతిబింబించాలి - పోప్

జోసెఫ్ అవినాష్

28 Nov 2026

2026 నవంబర్ 27న రోమ్‌లోని సంత్ ఆండ్రియా దెల్లే ఫ్రట్టే విచారణ సంఘాన్ని సందర్శించిన పోప్ లియో XIV, క్రైస్తవుల విశ్వాసం మాటల్లోనే కాకుండా ప్రేమ, సేవా కార్యాల ద్వారా ప్రతిబింబించాలని పిలుపునిచ్చారు.కానా వివాహ విందులో యేసు చేసిన మొదటి అద్భుతాన్ని ప్రస్తావిస్తూ,మన దగ్గర ఉన్నది కొద్దిపాటిదైనా దేవునికి సమర్పించినప్పుడు ఆయన దానిని గొప్ప కార్యాలకు ఉపయోగిస్తారని వివరించారు.నేటి సమాజంలో పేదరికం,ఒంటరితనం,యుద్ధాలు, అసమానతలు వంటి సమస్యల మధ్య పేదలు,వృద్ధులు, వలసదారులు,కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.విచారణ సంఘాలు అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ,ప్రతి ఒక్కరికీ ఆత్మీయ స్వాగతం,ప్రేమ, గౌరవం అందించే కేంద్రాలుగా ఉండాలని పోప్ కోరారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN