జాగరూకులై ఆనందముతో వేచియుండండి
.jpg)
జోసెఫ్ అవినాష్
28 Nov 2026
సామాన్య ఆఖరి శనివారం
సువిశేష ధ్యానం:-
లూకా 21:34-36
ధ్యానం:
జాగరూకులై ఆనందముతో వేచియుండండి అని నేటి సామాన్యకాలం ఆఖరి రోజున పఠనాలు ప్రభోదిస్తునాయి.ప్రవక్త దానియేలు తాను చూచిన దృశ్యాల భావాలను వివరిస్తున్నాడు.అన్యాయముగా రాజు కాలం పతనమవుతుంది.దేవుని శ్వాశ్వత పాలనకు స్వాగతము పలకబడును దైవ ప్రజలకు,పాలకులకు కావలసిన వైభవము, విధేయతను కలిగి ఆచరించాలి.
ఈ వినూత్న మార్పు గురించి క్రీస్తు ప్రభువు సువిశేషంలో ఇంకాస్త వివరంగా వివరిస్తున్నాడు.సకల విపత్తులను ఎదుర్కొని శక్తిని, లోకాంతమున వచ్చే కడవరి తీర్పునకు సంసిద్ధంగా ఉండండి. మనుష్య కుమారుడు లోక తీర్పరిగా రానున్నడని కనుక జాగరూకులై జీవించండి న్యాయ తీర్పుకోసం వేచియుండండి క్రీస్తు బోధన, బాధ్యత, భక్తిని పెంచాలి.
మనం ఎల్లప్పుడును జాగరూకులై ఉండి, ప్రార్ధనలు చేయాలని ప్రభువు సువిశేషంలో తెలియజేస్తున్నారు.మనం మంచిని చేయటానికీఎల్లప్పుడు ప్రయత్నం చేయాలి,త్రాగుడుతోను,ఈలోక సుఖాలపై దృష్టి పెట్టోదని ప్రభువు పిలుపునిస్తున్నారు.ఈలోక సంపదలపై శ్రద్ద కలిగినట్లుగా, పరలోక సంపదలను యందు కూడా శ్రద్దను చూపాలి, రక్షణ పొందాలి.
