ఒంటరితనాన్ని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయి: పోప్

జోసెఫ్ అవినాష్

27 Nov 2026

నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల వినియోగం కారణంగా అనేకమంది యువత ఒంటరితనానికి గురవుతున్నారని పోప్ లియో XIV అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. క్రీడలు యువతను ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇతరులను కలుసుకోవడానికి, జట్టుగా కలిసి పనిచేయడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రోత్సహిస్తాయని తెలిపారు. క్రీడల ద్వారా విధేయత, ధైర్యం, సహనం, పట్టుదల, సోదరభావం వంటి విలువలు అలవడటమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైతిక మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యమవుతాయని వివరించారు. ఈ సందర్భంగా ఇటలీ స్పోర్ట్స్ సెంటర్ అందిస్తున్న సేవలను అభినందించిన పోప్, యువతలో మంచి స్నేహబంధాలను పెంపొందించడంలో, అపార్థాలు మరియు విభేదాలను తొలగించడంలో ఆధ్యాత్మిక గురువులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అంతేకాకుండా, దేవుని వాక్కు మరియు దైవసంస్కారాల ద్వారా యువతను క్రీస్తుతో సన్నిహితం చేయాలని పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN