సమగ్ర మానవ అభివృద్ధి సువార్త ప్రకటనలో అంతర్భాగం: పోప్

జోసెఫ్ అవినాష్

27 Nov 2026

సువార్త ప్రకటనకు, సమగ్ర మానవ అభివృద్ధికి విడదీయరాని సంబంధం ఉందని పోప్ లియో XIV స్పష్టం చేశారు. నవంబర్ 26న వాటికన్‌లో సమగ్ర మానవ అభివృద్ధి విభాగం (Dicastery for Promoting Integral Human Development) సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సభ్యులతో ఆయన మాట్లాడుతూ, సువార్తను కేవలం సామాజిక సేవా కార్యక్రమంగా పరిమితం చేయకూడదని, అదే సమయంలో ప్రజల వాస్తవ జీవిత సమస్యల నుంచి సువార్త ప్రకటనను వేరుచేయకూడదని పేర్కొన్నారు. పేదలు, నిరుపేదలు, అణగారిన వర్గాలు, అనారోగ్యం, అన్యాయం, ప్రకృతి విపత్తుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి గౌరవాన్ని కాపాడటం సంఘం బాధ్యతని గుర్తుచేశారు. యేసు లాజరును సమాధి నుంచి బయటకు పిలిచిన సందర్భాన్ని ఉదాహరణగా వివరిస్తూ, మనుషుల అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆటంకాలను తొలగించి, వారిలోని మంచితనాన్ని వెలికితీయడానికి సంఘం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదరికానికి, అన్యాయానికి కారణమయ్యే వ్యవస్థలను ధైర్యంగా ప్రశ్నించాలని, ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం లభించేలా కృషి చేయాలని సూచించారు. నిజమైన శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదని, న్యాయం, మానవ గౌరవ పరిరక్షణ, ప్రజల మధ్య సోదరభావం, సమగ్ర పర్యావరణ పరిరక్షణ ద్వారా అది సాధ్యమవుతుందని పోప్ వివరించారు. రెండవ వాటికన్ మహాసభ స్ఫూర్తితో స్థానిక సంఘాల్లోనూ, సమాజంలోనూ సువార్త విలువలను ఆచరణలో చూపిస్తూ, సహనంతో నిరీక్షించే మరియు ధైర్యంగా కార్యాచరణకు దిగే ఆశకు సేవకులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN