భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

26 Nov 2026

మనం రాజులం-నిస్తేజులం!
*********************
స్వాతంత్రం అనగానే
'గాంధీజీ' అంటాము-
రాజ్యాంగం అనగానే 'అంబేడ్కర్' అంటాము/
స్వాతంత్ర్యం రాగానే పరాయోళ్ళు పోయారు-
రాజ్యాంగం రాగానే
మన పాలకులొచ్చారు/
మనది ప్రజా స్వామ్యమని రాజ్యాంగం చెప్పింది-
పాలకులకు అంతులేని అధికారం లేదంది /
మన దేశానికి రాజులం ప్రజలైన మనమంటూ
-మన పాలకులందరూ
మన సేవకులేనంటూ/
చెప్పినట్టు చేయకుంటె
శిక్షలు పడతాయంది-
అందుకోసమన్ని చోట్ల 'కోర్టుల'నే పెట్టింది/
మనం ఓట్లు వేస్తేనే
సీట్ల పైన చేరాలి-
ప్రజాస్వామ్య బద్ధంగా
పరిపాలన చేయాలి/
కోర్టు తప్పు
పడితేను పదవులను వీడాలి
- పెద్దయినా చిన్నయినా
రాజ్యాంగ బద్ధులవ్వాలి/
అది మన రాజ్యాంగ
స్ఫూర్తి,ప్రజాస్వామ్య
ఘన కీర్తి- మొదటి
నాళ్ళదా రీతి,నేడాయె
మొండి కత్తి/
గద్దెపైన చేరినట్టి
మేమే మహ రాజలం-
మామాటే రాజ్యాంగమనే
పాలకులను చూస్తున్నాం/
కులం,మతం,నోట్లకై
ఓట్లనమ్ముకుంటున్నాం-
రాజ్యాంగం మంట గలువ
కళ్ళప్పగించి చూస్తున్నాం/

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN