అపోస్తలుల సంప్రదాయమే విశ్వాసానికి పునాది: పోప్

జోసెఫ్ అవినాష్

25 Nov 2026

వాటికన్ వేదికగా నవంబర్ 25న అంతర్జాతీయ దైవశాస్త్ర కమిషన్ సభ్యులతో సమావేశమైన పోప్ లియో XIV, అపోస్తలుల నుంచి అందిన విశ్వాస సంప్రదాయాలను తరతరాలకు అందించడం శ్రీసభ బాధ్యతని తెలిపారు.కాలానుగుణంగా విశ్వాస సత్యాలపై అవగాహన మరింత లోతుగా మారినప్పటికీ,వాటి అసలైన బోధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు.ప్రతి దేశ సంస్కృతి,సంప్రదాయాలను గౌరవిస్తూ సువార్తను ప్రకటించాలని,ప్రజల భక్తి సంప్రదాయాలు విశ్వాసాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. యేసుక్రీస్తే సజీవమైన సత్యమని, ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN