మైనారిటీల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలి: సీబీసీఐ

జోసెఫ్ అవినాష్

24 Nov 2026

భారతదేశంలోని క్రైస్తవులతో పాటు ఇతర మతపరమైన మైనారిటీల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCI) పిలుపునిచ్చింది. నవంబర్ 26న జరుపుకోనున్న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన సందేశంలో సీబీసీఐ అధ్యక్షులు, హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహా ఘన.కార్డినల్ అంతోని పూల ఈ విషయాన్ని స్పష్టం చేశారు. క్రైస్తవులు,ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ,రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేయాలని కోరారు. మతం,భాష,సమాజం పేరుతో ఎవరి హక్కులనైనా ప్రశ్నించడం రాజ్యాంగంలోని సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.దేశంలోని కతోలిక సంస్థలన్నీ రాజ్యాంగాన్ని, ముఖ్యంగా దాని పీఠికను అధ్యయనం చేసి, భారత ప్రజాస్వామ్య విలువలపై ఆలోచించాలని ఆయన సూచించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN