సైక్లింగ్ సమృద్ధికరమైన జీవితానికి ప్రతీక: పోప్
జోసెఫ్ అవినాష్
24 Nov 2026
క్రీడలు కేవలం శారీరక వ్యాయామానికే పరిమితం కాకుండా, జీవితానికి ఎన్నో విలువలను నేర్పిస్తాయని పోప్ లియో XIV పేర్కొన్నారు.నవంబర్ 23న అంతర్జాతీయ సైక్లింగ్ సమాఖ్య (UCI) ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,సైక్లింగ్ సమృద్ధికరమైన జీవితానికి ప్రతీక అని అన్నారు.సైకిల్ ప్రయాణం మనకు పట్టుదల,సమతుల్యత, ముందుకు సాగాలనే స్ఫూర్తిని నేర్పిస్తుందని వివరించారు. విశ్వాస ప్రయాణం కూడా ఇలాంటిదేనని,నిరంతరం ముందుకు సాగినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం బలపడుతుందని తెలిపారు.క్రీడల ద్వారా మానవీయ విలువలను పెంపొందించాలని,ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సైక్లిస్టులను ప్రార్థనలో స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
