దైవార్చనసంవత్సరం అంటే ఏమిటి?

జోసెఫ్ అవినాష్
24 Nov 2026
దైవార్చన సంవత్సరం అంటే క్రీస్తు జీవిత చరిత్రలోని కీలకమైన ఘట్టాలను -ఒక సంవత్సరకాలంలో స్మరించుకోవడానికి అనువుగా సిద్ధం చేసిన దైవరాధన క్రమం! ఈ దైవార్చన సంవత్సరం - ప్రభువు రాక కోసం ఎదురు చూచే "ఆగమనకాలం"తో ఆరంభమవుతుంది.ఈ ఆగమనకాలం క్రీస్తు జయంతితో పతాక స్థాయికి చేరుతుంది.క్రీస్తు జయంతికాలం తరువాత అరంభమయ్యే తపస్కాలంలోనే మనం ప్రభు శ్రమలు మరణ ఘట్టాలను స్మరించుకుంటాం.ఈ తపస్కాలం క్రీస్తు పునరుత్థాన మహోత్సవంతో పతాకస్థాయికి చేరుకుంటుంది.క్రీస్తు పునరుత్థాన కాలం - పవిత్రాత్మ ప్రభువు. శ్రీసభపై వేంచేసివచ్చే పెంతెకోస్తు మహోత్సవంతో ముగుస్తుంది. అలాగే సంవత్సరం పొడవున మరియమాత పర్వదినాలను పునీతుల పండుగలను భక్తిశ్రద్ధలతో కొనియాడటం జరుగుతుంది (CCC 1168-1173, 1194-1195)
