అంత్యకాలమా? భయం కాదు భక్తిని, విశ్వాసాన్ని పెంచుకోండి!

జోసెఫ్ అవినాష్

23 Nov 2026

సామాన్య చివరి మంగళవారం
సువిశేష ధ్యానం:
లూకా 21:5-11
అంతిమ దినాల గురించి ఆందోళన పనికిరాదని యేసు బోధిస్తున్నాడు.అంతిమ సూచనలు కనిపించినప్పుడు, భయపడక ధైర్యంగా ఉండాలి. యేసు శిష్యులలో కలవరం ఉండకూడదు అన్నాడు.ఆత్మవిశ్వాసముతో దేవుని చూడాలన్న ఆకాంక్ష కనిపించాలి.మన చుట్టూ వివిధ సంఘటనలు జరుగుచున్నప్పుడు, తప్పుడు బోధనలతో మనల్ని మోసగించే వారు ఉంటారు.తమ సొంత ప్రయోజనాలకు,వివిధ రకాలైన సూచనలను ఉపయోగించుకుంటారు.ప్రజలను మభ్యపెట్టి,వారి నుండి దోచుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇలాంటివన్నీ ప్రస్తుతం ప్రపంచంలో చూస్తూనే ఉన్నాము.యేసు ముందుగానే హెచ్చరికలు చేశాడు.యేసు రాకడ దినం భయంకరంగా ఉంటుంది.అయితే యేసు శిష్యులకు మాత్రం అది దేవుని మహిమ దినంగా కనిపిస్తుంది. అబద్ద బోధకుల విష ప్రచారం గురించి యేసు హెచ్చరించాడు.యేసు పేరిట అనేకమంది అబద్ధ బోధకులు, ప్రవచనకర్తలు బయలుదేరి, ప్రజలను భయకంపితులను చేస్తారని,కాబట్టి మనము చెదిరిపోకుండా,విశ్వాసముతో యేసుతో ఉండాలని,నిరుత్సాహ పడకూడదని,సువార్త పాఠం నేర్పిస్తుంది.గత ప్రపంచ అనుభవాలు,ఇప్పటికీ అనేకమంది,విశ్వాసులను అస్థిరపరిచే శక్తులుగా ఉన్నారు. బూటకపు మాటలతో,ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. లోకాంత్యము ఎప్పుడు? ఎలా ఉంటుంది? వీటి గురించి ఆలోచించడం మన పని కాదు.సూచనలు కనిపించడం మనల్ని అప్రమత్తులను చేయడానికి గాని,భయకంపితులను చేయడానికి కాదు.విపత్తులు వచ్చినప్పుడు,అంటు రోగాలు ప్రబలినప్పుడు,భూకంపాలు వచ్చినప్పుడు,యుద్ధాలు పెరిగినప్పుడు,యేసు ముందే చెప్పిన వివిధ సంఘటనలు కళ్ళ ముందు. కనిపించినప్పుడు, యేసు రాకడకై మనం సిద్ధంగా ఉన్నామా లేదా పరిశీలించుకోవాలి.దేవుని మహిమ కార్యాలు చేయాలి.విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి.యేసు చూపిన మార్గంలోనే నడవాలి.ఎవరు మనల్ని మోసగింపకుండుటకై, ఆత్మపూరితలంగా జీవించాలి.ఈ విషయాలన్నీ యేసు,మనల్ని తన రాకడకు సంసిద్ధ పరచడానికి బోధించాడు.ప్రియ సహోదరులారా!ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న జీవితం, రేపు మరోలా ఉండవచ్చు.దేవుని అనుగ్రహాన్ని కోల్పోకుండా ఉంటే, విశ్వాసంలో బలంగా ఉంటాము. పరలోక రాజ్యములో ప్రవేశించడానికి,మనల్ని మనము. సంసిద్ధపరచుకుంటాము. భయంతో కాదు,భక్తితో జీవించుదాము.నిరుత్సాహంతో కాదు, ఆత్మవిశ్వాసంతో జీవించుదాము.లోకముతో కాదు, దేవునితో జీవించుదాము.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN