పేదలతో కలిసి భోజనం చేసిన పోప్
జోసెఫ్ అవినాష్
23 Nov 2026
నవంబర్ 22న పేదల దినోత్సవాన్ని పురస్కరించుకొని వాటికన్‌లోని పాల్ VI ఆడియన్స్ హాల్‌లో పోప్ లియో XIV సుమారు 1,300 మంది పేదలు,నిరుపేద కుటుంబాలు, చిన్నారులు,స్వచ్ఛంద సేవకులతో కలిసి భోజనం చేశారు. వివిధ సేవా సంస్థల సహకారంతో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఇటలీ రెడ్‌క్రాస్‌కు చెందిన 400 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ, ఈ సమావేశం మనందరినీ ఒకే కుటుంబంగా కలిపిందని,ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.మనం ఎప్పుడూ ఒంటరివాళ్లం కాదని,జీవిత ప్రయాణంలో ఒకరికొకరం తోడుగా నిలవాలని,ఇతరులకు స్నేహాన్ని,సహకారాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు.ముఖ్యంగా యేసుక్రీస్తులో ఐక్యమై,పేదలు మరియు అవసరాల్లో ఉన్నవారి పట్ల ప్రేమ,కరుణ, సోదరభావాన్ని చూపాలని కోరారు.ప్రతి కుటుంబం శాంతితో జీవించాలని,ఎవరికీ కనీస అవసరాలకు కొరత ఉండకూడదని ప్రార్థించారు.
