దేవుని తీర్పు మనకు రక్షణను ప్రసాదిస్తుంది: పోప్
జోసెఫ్ అవినాష్
23 Nov 2026
క్రీస్తురాజు మహోత్సవం సందర్భంగా పోప్ లియో XIV వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో విశ్వాసులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా దేవుని అంతిమ తీర్పు గురించి వివరిస్తూ,క్రీస్తు నిజమైన న్యాయానికి కొలమానమని,ఆయన తీర్పు మానవాళికి రక్షణను,దేవుని కరుణను ప్రకటిస్తుందని తెలిపారు.ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం,పరాయివారిని ఆదరించడం, నిరాశ్రయులకు వస్త్రాలు ఇవ్వడం,ఖైదీలను పరామర్శించడం వంటి దయా కార్యాల ద్వారా క్రైస్తవులు నిజమైన విశ్వాసాన్ని జీవించాలని పిలుపునిచ్చారు.దైవార్చన సంవత్సరాంతంలో క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకోవడం చరిత్ర అంతిమంగా దేవునితో జరిగే కలయికను గుర్తుచేస్తుందని అన్నారు.దేవుని తీర్పు దుష్టత్వానికి,అన్యాయానికి ఖండనగా నిలుస్తూనే, మానవాళికి కరుణను,రక్షణను అందిస్తుందని వివరించారు. క్రీస్తు అధికారం చెలాయించే రాజు కాదని,తన ప్రేమతో మానవాళిని విమోచించే శాంతి, న్యాయాల రాజని పోప్ స్పష్టం చేశారు.దేవుని రాజ్యం శాశ్వతమైనదని,ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలకు అనుగుణంగా జీవించాలని పిలుపునిచ్చారు.
