త్యాగం విలువ గొప్పది

జోసెఫ్ అవినాష్

22 Nov 2026

సామాన్య 34వ సోమవారం
సువిశేష ధ్యానం -:
లూకా 21:1-4
'కావాలి' 'కావాలి' ఇంకా కావాలి, అని ప్రాకులాడే ప్రపంచంలో జీవిస్తున్నాము.ఎంత ఉన్నా సంతృప్తి లేదు.కంటి నిండా కనిపించినా కునుకు లేదు.నాకంటే మరొకరికి ఎక్కువ ఉన్నదన్న అసూయ మనిషిలో పెరిగిపోయింది.సంపాదన ఒక్కటే లక్ష్యంగా జీవిస్తాము.ఇలాంటి ఆలోచన ధోరణిని,యేసు సూటిగా ప్రశ్నించాడు,ఖండించాడు. హెచ్చరించాడు.దేవుడిచ్చిన దానిలో,దశమ భాగం దేవునికి చెల్లించాలన్న, ధర్మశాస్త్ర నియమం ఉన్నది.యూదులు ఈ నియమాన్ని తప్పక పాటిస్తారు.దానిద్వారా,ఆలయ ఆదాయం పెరిగి,సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది.సహోదర భావాన్ని పెంచుతుందా? మన త్యాగం మనకు దేవునికి మధ్యనే ఉండాలని గ్రహించామా? దేవాలయములో కానుకలు వేసే వారిని యేసు పరిశీలించాడు. ధనికులు వస్తున్నారు.వారి సమృద్ధి నుండి కానుకలు అర్పిస్తున్నారు. యేసు, ఒక పేద వితంతువురాలిని ఆశ్చర్యంగా పరిశీలించాడు. ఆమె జీవనాధారం అంతా కానుక పెట్టెలో వేసింది. ఆమె తన కడుపు నింపుకోవాలి అనుకోలేదు. తన జీవితాన్ని దేవుడే పోషిస్తాడు అన్న నమ్మకం ఆమెలో ఉన్నది. దేవుడు అలాంటి వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. దేవునికి ఇచ్చే కానుక సంతృప్తికరంగా ఇవ్వాలి. బలవంతంగా ఇచ్చే కానుక ద్వారా ఎలాంటి ఫలితం ఉండదు. చింతతో, ఒత్తిడితో చేసే త్యాగానికి బహుమానం శూన్యం. యేసు ఆ పేద వితంతువును మెచ్చుకున్నాడు. ఆమె చేసిన త్యాగాన్ని ఆదర్శంగా చూపాడు. క్రైస్తవ విశ్వాసులంగా, నిజమైన త్యాగ గుణం మనలో ఉన్నదా? దేవుడిచ్చే శక్తిని నమ్ముకొని జీవిస్తున్నామా ? పరిపూర్ణ త్యాగం చేసేవారు, దేవుని శక్తిని నమ్ముకుంటారు. స్వార్థంతో ఆలోచించేవారు, తమపై తాము ఆధారపడతారు. దేవునికి కానుక చెల్లించడంలో సంతోషించాలి. దేవునికి ఇచ్చే కానుకలను బాధ్యతాయుతంగా ఉపయోగించడము ముఖ్యమే. పేదరాలి రెండు కాసులను, దేవుని దృష్టిలో విలువైన కానుకగా యేసు మెచ్చుకున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో, లేని వారితో పంచుకోవడం ఆధ్యాత్మిక సుగుణం. దేవునికి ఇవ్వడంలోనే సమృద్ధి, సంతృప్తి కనిపిస్తుంది. మనకున్న దానిలో, దేవుడిచ్చిన దానిలో, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడం ముఖ్యం. నిజమైన పేదరికం, ధనం లేకపోవడం కాదు, ధనం కోసమే జీవితం అనుకోవడమే. పేద వితంతువు వలె త్యాగపూరితంగా, తృప్తికరంగా జీవించుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN