దుర్వినియోగాన్ని అరికట్టడం, బాధితులకు న్యాయం చేయడం క్రైస్తవ పరివర్తనలో భాగం: పోప్

జోసెఫ్ అవినాష్

18 Nov 2026

బుధవారం జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశం ముగింపులో పోప్ లియో XIV పలు ముఖ్యమైన అంశాలపై తన సందేశాన్ని అందించారు.ఇటలీలో నవంబర్ 18న దుర్వినియోగ బాధితులు,దాని నుంచి బయటపడిన వారి కోసం నిర్వహిస్తున్న జాతీయ ప్రార్థనా దినాన్ని ఆయన గుర్తుచేశారు.దుర్వినియోగాన్ని ముందుగానే అరికట్టడం, బాధితుల ఆవేదనను ఆలకించడం,జరిగిన అన్యాయాన్ని గుర్తించి వారికి సత్యం,న్యాయం, పునరుద్ధరణ అందించే మార్గాల్లో నడవడం క్రైస్తవ పరివర్తనలో భాగమని పోప్ పేర్కొన్నారు.బాధితుల మాటలను శ్రద్ధగా వినడం ద్వారా వారి గాయాలను మాన్పగలమని,చెడును చెడుగా గుర్తించి దానిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే నవంబర్ 21న జరగనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ, సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్న మత్స్యకారులు, యుద్ధ ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు, సముద్రపు దొంగల దాడులకు గురవుతున్నవారు, జీవనోపాధి కోసం వలస వెళ్తున్నవారి పట్ల తన సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, సముద్ర వనరుల క్షీణత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీర ప్రాంత ప్రజలను కూడా ఆయన ప్రత్యేకంగా స్మరించుకున్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN