లాటిన్ అమెరికా పర్యటన ఫలాలను గుర్తుచేసుకున్న పోప్
జోసెఫ్ అవినాష్
18 Nov 2026
ఉరుగ్వే, అర్జెంటీనా, పెరూ దేశాల్లో తన అపోస్టోలిక్ పర్యటన ముగించుకొని రోమ్‌కు తిరిగి వచ్చిన పోప్ లియో XIV, బుధవారం జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో తన పర్యటన అనుభవాలను పంచుకున్నారు.ఈ పర్యటన దేవుడు ప్రసాదించిన గొప్ప వరమని పేర్కొన్న ఆయన,వివిధ దేశాల్లోని స్థానిక సంఘాలను సందర్శించడం ద్వారా అక్కడి విశ్వాసుల విశ్వాసాన్ని,ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత దగ్గరగా తెలుసుకోగలిగానని తెలిపారు.దేవుని వాక్యాన్ని వినడం, దైవార్చనలో పాల్గొనడం,సేవా కార్యక్రమాల ద్వారా కతోలిక సంఘం ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. ముఖ్యంగా పెరూలోని చిక్లాయో ప్రాంతంలో తాను స్వస్థలంలో ఉన్న అనుభూతిని పొందానని,అక్కడి ప్రజల సరళమైన, నిజమైన విశ్వాసం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు.ఈ పర్యటనలో ప్రతి అడుగులోనూ తల్లి మరియమ్మ తోడుగా నిలిచారని గుర్తుచేసుకుంటూ,ఆయా దేశాల ప్రజలకు శాంతి,న్యాయం,సోదరభావం కలగాలని ప్రార్థించారు.
