క్రైస్తవులపై దాడులు అరికట్టండి.. బెంగాల్ సీఎంకు క్రిస్టియన్ కౌన్సిల్ విజ్ఞప్తి.

జోసెఫ్ అవినాష్

17 Nov 2026

పశ్చిమ బెంగాల్‌లో చర్చిలు, క్రైస్తవ ప్రార్థనా కార్యక్రమాలపై వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారీ తక్షణమే జోక్యం చేసుకోవాలని బెంగాల్ క్రిస్టియన్ కౌన్సిల్ కోరింది. క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి దైవార్చనలు, క్రిస్మస్ గీతాల ప్రదర్శనలు (కరోల్స్), ఇతర వేడుకలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించగలమా అనే ఆందోళనను వ్యక్తం చేసింది. కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కౌన్సిల్ అధ్యక్షుడు, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా సైనడ్ మోడరేటర్ బిషప్ పరితోష్ కన్నింగ్ మాట్లాడుతూ, గురువులను, విశ్వాసులను లక్ష్యంగా చేసుకొని కొందరు దుండగులు దాడులకు పాల్పడుతున్నారని, చర్చిలు, శిలువలను ధ్వంసం చేస్తూ క్రైస్తవ కుటుంబాలను బెదిరిస్తున్నారని తెలిపారు. క్రైస్తవ సమాజానికి, ప్రార్థనా మందిరాలకు రక్షణ కల్పించి, మత స్వేచ్ఛను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలిసేందుకు ఇప్పటికే సమయం కోరామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN