భారత్‌కు కొత్త అపోస్టోలిక్ న్యూన్షియోగా ఆర్చ్‌బిషప్ వాల్డెమార్ నియామకం

జోసెఫ్ అవినాష్

15 Nov 2026

విశ్వ కాపరి పోప్ లియో XIV భారతదేశానికి నూతన పోప్ అపోస్తలిక రాయబారిగా మహా. ఘన...వాల్డెమార్ స్టానిస్లావ్ సోమెర్టాగ్ (58)ను నియమించారు.పోలాండ్‌లోని వైంబోర్క్‌లో 1968 ఫిబ్రవరి 6న జన్మించిన ఆయన 1993 మే 30న గురువుగా అభిషిక్తులయ్యారు.రోమ్‌లోని పోంటిఫికల్ ఎక్లెసియాస్టికల్ అకాడమీలో దౌత్యవిద్యను, పోంటిఫికల్ యూనివర్సిటీ ఆఫ్ హోలీ క్రాస్‌లో శ్రీసభ చట్టాన్ని అభ్యసించారు. 2000లో వాటికన్ దౌత్య సేవల్లో చేరిన ఆయన టాంజానియా, నికరాగువా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, మాంటెనెగ్రో, ఇజ్రాయెల్, పాలస్తీనా తదితర దేశాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2018లో పోప్ ఫ్రాన్సిస్ ఆయనను నికరాగువాకు అపోస్టోలిక్ పోప్ రాయబారిగా నియమించి, అగ్ర పీఠాధిపతిగా అభిషేకించారు.అనంతరం సెనెగల్, కేప్‌వెర్డే, గినియా-బిస్సావు, మౌరిటానియా దేశాలకు అపోస్టోలిక్ రాయబారిగా సేవలందించారు. ఇప్పుడు భారతదేశానికి పోప్ ప్రతినిధిగా, అలాగే భారత ప్రభుత్వానికి హోలీ సీ దౌత్య ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. భారతదేశంలోని కతోలిక సంఘంతో వాటికన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఆయన కొత్త బాధ్యతలో ముఖ్య ఉద్దేశ్యం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN