బాధితుల గళం వినాలి.. శ్రీసభలో సురక్షిత వాతావరణం కల్పించాలి: పోప్

జోసెఫ్ అవినాష్

13 Nov 2026

నవంబర్ 12న పెరూలోని లిమాలోని అపోస్టోలిక్ నున్సియేచర్‌లో పోప్ లియో XIV మతాధికారుల చేతుల్లో లైంగిక దుర్వినియోగానికి గురైన ఆరుగురు బాధితులను కలుసుకున్నారు.గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో బాధితులలో ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడి,వారు అనుభవించిన బాధలను శ్రద్ధగా ఆలకించారు.బాధితుల మాటలను వినడం,నిజాన్ని వెలికితీయడం, వారు కోలుకునేందుకు సహకరించడం,ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా శ్రీసభలో మార్పు తీసుకురావాలని పోప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బాధితుల ధైర్యమైన వాంగ్మూలాలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, వారిపట్ల తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేస్తూ ఆశీర్వదించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN