తప్పులు చేసినా నిరాశ చెందకండి.. క్రీస్తు మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు: పోప్

జోసెఫ్ అవినాష్

13 Nov 2026

పెరూలోని లిమా నగరంలోని జాతీయ స్టేడియంలో నవంబర్ 12న యువత,విశ్వవిద్యాలయ విద్యార్థులతో నిర్వహించిన ప్రార్థనా జాగరణలో పోప్ లియో XIV ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి సుమారు 60 వేల మంది యువత హాజరయ్యారు.జీవితంలో ఎన్నో తప్పులు చేశామని,తిరిగి ప్రారంభించడానికి సమయం మించిపోయిందని భావించే యువత నిరాశ చెందవద్దని ఆయన పిలుపునిచ్చారు. “యేసు మీ జీవిత కథను ఎరుగును.ఆయన ఇప్పటికీ తనతో కలిసి నడవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు” అని భరోసా ఇచ్చారు. భవిష్యత్తు గురించి అన్ని విషయాలు ముందుగానే నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదని,నేడు వేయగలిగిన చిన్న అడుగుతో ముందుకు సాగుతూ దేవుని ప్రేమపై నమ్మకం ఉంచాలని సూచించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN