ఎంత ప్రేమ?

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

13 Nov 2026

ఎంత ప్రేమ?
*********
దివ్యతేజా! ఏసు రాజా!
నింగి నేలకు రాజువైనా
పేద వానిగ పుట్టినావా?
దిక్కులేని మనుషులంటే
ఎందుకయ్యా ఇంత ప్రేమ?

దీన బాంధవ ఏసు దేవా!
మానవాళికి రక్షకుడవై
ముక్తి మార్గము చూపినావా?
దారి తప్పిన మనుషులంటే
ఎందుకయ్యా ఇంత ప్రేమ?

భవ్య చరితా! లోక రక్షక!
దేవ దేవుని సుతుడవైనా
సిలువ పైనా కొట్ట బడితివి
పాపులైనా మనుషులంటే
ఎందుకయ్యా ఇంత ప్రేమ?

మరియ పుత్రా! మాననీయా!
నమ్మ లేని వారలకు
నీ మహిమాలెన్నో చూపినావు!
చపలురైన మనుషులంటే
ఎందుకయ్యా ఇంత ప్రేమ?

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN