మైనారిటీలపై విద్వేష జ్వాలలు.. భారత్‌లో పెరుగుతున్న దాడులు

జోసెఫ్ అవినాష్

12 Nov 2026

భారత్‌లో ముస్లింలు,క్రైస్తవ మైనారిటీలపై పెరుగుతున్న విద్వేష నేరాలు,విద్వేష ప్రసంగాల పట్ల మతపెద్దలు,మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (APCR) నవంబర్ 10న న్యూఢిల్లీలో విడుదల చేసిన నివేదిక ప్రకారం,2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశంలోని 24 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని 322 విద్వేష ఘటనలు చోటుచేసుకోగా,54 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనల్లో 119 సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మరణించిన వారిలో 12 మంది పోలీసుల ఎన్‌కౌంటర్లలో, తొమ్మిది మంది పోలీసు కస్టడీ లేదా జైళ్లలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని 15 దాడులు జరగ్గా,వాటిలో ఎక్కువ భాగం మతమార్పిడుల ఆరోపణలకు సంబంధించినవని వెల్లడించింది.అలాగే మైనారిటీలకు వ్యతిరేకంగా 16 రాష్ట్రాల్లో 83 విద్వేష ప్రసంగాలు నమోదయ్యాయని,వాటిలో 33 ప్రసంగాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ప్రజాప్రతినిధులు చేసినవిగా నివేదిక పేర్కొంది.మరోవైపు, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (UCF) జనవరి నుంచి అక్టోబర్ చివరి వరకు క్రైస్తవులపై జరిగిన హింసకు సంబంధించి 474 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 104, ఛత్తీస్‌గఢ్‌లో 87 ఘటనలు నమోదయ్యాయని తెలిపింది.మతంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడి హక్కులను,భద్రతను ప్రభుత్వాలు కాపాడాలని మానవ హక్కుల కార్యకర్తలు పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN