స్వదేశానికి దూరంగా ఉన్నంత మాత్రాన మాతృభూమిపై ప్రేమ తగ్గదు: పోప్
జోసెఫ్ అవినాష్
12 Nov 2026
పెరూలోని లిమా నగరంలో ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలను ఉద్దేశించి తన తొలి బహిరంగ ప్రసంగం చేసిన పోప్ లియో XIV,స్వదేశానికి దూరంగా జీవిస్తున్నంత మాత్రాన మాతృభూమిపై ప్రేమ తగ్గిపోదని అన్నారు. పెరూతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ,రెండు దశాబ్దాలకు పైగా ఆ దేశ ప్రజల మధ్య జీవించానని,వారి విశ్వాసం,ఆప్యాయత తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. దేశంలో శాంతి,ఐక్యత,ప్రజల గౌరవప్రదమైన జీవితం కోసం నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రజల సమస్యలను శ్రద్ధగా వినడం,నిజాయితీతో వ్యవహరించడం, ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం ముఖ్యమని చెప్పారు.పేదలు,అనారోగ్యంతో బాధపడేవారు,వృద్ధులు, వికలాంగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హింసకు దూరంగా శాంతిని నెలకొల్పేందుకు సంభాషణ, సహకారం,అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం అవసరమని పేర్కొన్నారు.దేశ విదేశాల్లో నివసిస్తున్న పెరూ ప్రజలను ఉద్దేశించి,మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ దేశంపై ప్రేమను,అనుబంధాన్ని కోల్పోరాదని సందేశమిచ్చారు.
