పాపం ఎంత లోతుకు లాగినా.. క్రీస్తు ప్రేమ మనల్ని పైకి లేపుతుంది –పోప్
జోసెఫ్ అవినాష్
11 Nov 2026
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో నవంబర్ 10న సుమారు 10 లక్షల మంది యువత పాల్గొన్న ప్రార్థనా జాగరణలో పోప్ లియో XIV ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ,విజయం, డబ్బు,అందం,ప్రజాదరణ,విచ్చలవిడిగా సుఖాలను అనుభవించాలనే కోరిక వంటి ప్రలోభాలకు బానిసలుగా మారవద్దని హెచ్చరించారు.దేవునికి దూరం చేసే దేనికీ మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వకూడదని సూచించారు. ఎంతటి తప్పులు చేసినప్పటికీ నిరాశ చెందకుండా తిరిగి క్రీస్తు వద్దకు రావాలని,పాపంలో ఎంత దిగజారిపోయినా క్రీస్తు మనలను తిరిగి పైకి లేపగలడని భరోసా ఇచ్చారు.క్రీస్తు మనలను ఉన్న స్థితిలోనే ప్రేమిస్తాడు,అయితే పాపానికి బానిసలుగా ఉండిపోవాలని ఆయన కోరుకోడని వివరించారు. యువత తమ బలహీనతలను దేవుని కృపకు అప్పగించి పునీతులుగా జీవించాలని,చదువు,పని, స్నేహితులతో గడిపే సమయం వంటి ప్రతి పనిని ప్రేమతో దేవునికి అర్పిస్తే అవి కూడా ప్రార్థనగా,పవిత్ర జీవనానికి మార్గంగా మారుతాయని పోప్ పిలుపునిచ్చారు.
