దేవుని శక్తి ఎన్నటికీ తగ్గదు – పరిచర్యలో నిరుత్సాహపడవద్దు: పోప్
జోసెఫ్ అవినాష్
11 Nov 2026
అర్జెంటీనాలో తన అపోస్టోలిక్ పర్యటనలో భాగంగా నవంబర్ 10న కోర్డోబాలోని అవర్ లేడీ ఆఫ్ ది అసంప్షన్ కేథడ్రల్‌లో పోప్ లియో XIV పీఠాధిపతులు, గురువులు, డీకన్లు,కన్యా స్త్రీలు , సెమినరీ విద్యార్థులు, ఉపదేసులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుని సేవలో నిమగ్నమైన వారు ప్రార్థనకు, దైవవాక్య పఠనానికి, దివ్యసత్ప్రసాదానికి తగిన సమయం కేటాయిస్తూ క్రీస్తుతో తమ వ్యక్తిగత సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. పేదలకు భౌతిక సహాయం అందించడంతోపాటు వారికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కూడా అందించాలని, ఎందుకంటే సంఘం కేవలం సేవా సంస్థ మాత్రమే కాదని, క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేయడానికి పంపబడినదని గుర్తుచేశారు. పరిచర్యలో అలసట, నిరాశ, పరిమితులు ఎదురైనా సువార్త ప్రకటనలో వెనుకడుగు వేయకూడదని, దేవుని శక్తి ఎన్నటికీ తగ్గదని భరోసా ఇచ్చారు. అర్జెంటీనాలో పునీతులైన పునీత బ్రోచెరో వంటి వారి జీవితాలను గుర్తుచేస్తూ, విశ్వాసంతో సేవలో కొనసాగాలని, నూతన పిలుపులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. చివరిగా “మన బలం తగ్గిపోవచ్చు, కానీ దేవుని శక్తి ఎన్నటికీ తగ్గదు. కాబట్టి మనం నిరుత్సాహపడకూడదు!” అంటూ సంఘ సేవకులకు నూతన ఆశను, ప్రోత్సాహాన్ని అందించారు.
