కృతజ్ఞత :పొందిన మేలులు మరిచిపోరాదు!

జోసెఫ్ అవినాష్

11 Nov 2026

సామాన్య 32వ బుధవారం
లూకా 17:11-19
ధ్యానం-:
ప్రతి రోజు దేవుని నుండి ఎన్నో మేలులు పొందుతాం. పొందిన మేలులకు కృతజ్ఞత చెప్పడం ద్వారా మరిన్ని మేలులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పొందిన మేలులు మరిచిపోయిన వారిని ఎవరు ఆదుకుంటారు? మనం అర్హుల కాకపోయినా దేవుడు మనపై ప్రేమ, కనికరం చూపాడు.ఎన్నో దీవెనలను ఇచ్చాడు. మన ప్రస్తుత జీవితం మన తెలివితేటలతో సాధించుకున్నది కాదు.దేవుని అనుగ్రహం వలన జీవితం అభివృద్ధి సాధ్యమైనది.దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట ద్వారా మనం దేవునిపై ఆధారపడి ఉన్నామని ప్రకటిస్తున్నాం.దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా దేవుని మహిమనుగాని,గొప్పతనాన్నిగాని పెంచడం లేదు. మన మంచితనాన్ని పెంచుకుంటున్నాం. యేసు సమరియా,గలిలియా ప్రాంతాల మీదుగా యెరూషలేముకు పోతున్నాడు. పదిమంది కుష్టురోగులు యేసుకు ఎదురయ్యారు.దూరంగా నిలబడి, గొంతెత్తి “ఓ యేసుప్రభువా!మమ్ము కనికరింపుము" అని కేకలు పెట్టారు. యేసు వారి ప్రార్థన విన్నాడు.వారిపై కనికరం చూపాడు.మీరు వెళ్లి యాజకులకు కనిపించండి అన్నాడు.. మార్గ మధ్యలోనే అందరూ శుద్ధులయ్యారు.ఒకడు మాత్రమే, స్వస్థతను గమనించి,దేవుని స్తుతించుచు తిరిగివచ్చి కృతజ్ఞతాపూర్వకంగా యేసు పాదాలపై పడ్డాడు.యేసు అతన్ని మెచ్చుకొని "నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినది" లేచి వెళ్లుము అన్నాడు. దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పక మన మొర వింటాడు. మనకు మేలు చేసిన దేవునికి ఋణపడి ఉండేలా జీవించడం కంటే దేవుడు మన నుండి ఏమి ఆశిస్తాడు! కృతజ్ఞతా భావం మనలో ఉంటే ఎన్నెన్నో మేలులను మనం కళ్లారా చూడగలం. పదిమంది కుష్టురోగులు శుద్ధులైనా కేవలం ఒక్కడే తిరిగి వచ్చి దేవుని స్తుతించాడు.అతడు మాత్రమే యేసు ప్రశంసలు పొందాడు.మనం దేవునికి కృతజ్ఞలమై జీవిస్తున్నామా!దేవునికి ప్రీతికరంగా ఉన్నామా! పొందిన మేలులను స్మరించుకుంటున్నామా! దేవుని సన్నిధికి కృతజ్ఞతా భావంతో వస్తున్నామా! పొందిన మేలులను దేవుని అనుగ్రహంగా భావిస్తున్నామా!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN