అంతర్జాతీయంగా 125కు పైగా అవార్డులు సాధించిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ సినిమా విజయోత్సవం

జోసెఫ్ అవినాష్
10 Nov 2026
అంతర్జాతీయంగా 125కు పైగా అవార్డులను గెలుచుకున్న ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ (The Face of the Faceless) సినిమా విజయోత్సవం, ప్రత్యేక ప్రదర్శన నవంబర్ 22న కేరళలోని ఎర్నాకుళం చావర కల్చరల్ సెంటర్లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక ప్రదర్శన, సాయంత్రం 4:30 గంటలకు జరిగే అభినందన కార్యక్రమాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాదు, ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ప్రారంభించనున్నారు. సీరో మలబార్ సభ మేజర్ ఆర్చ్‌బిషప్ మార్ రాఫెల్ తట్టిల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు,చలనచిత్ర బృంద సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
