కర్తవ్యం నిర్వహించు - సేవకునిగా జీవించు

జోసెఫ్ అవినాష్

09 Nov 2026

సామాన్య 32వ మంగళవారం
సువిశేష ధ్యానం -:
లూకా 17:7-10
మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులనుగు సేవకులం.మేము మా కర్తవ్యాన్నే నెరవేర్చితిమని" పలకాలని యేసు బోధించాడు.బాధ్యత లేకుండా జీవించేవారు చాలామంది ఉన్నారు.వారికి వారి జీవితం మీద పరుల జీవితం మీద ఎలాంటి అవగాహన ఉండదు.స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తారు.అందరి మేలు కోరుకోరు.ఒక సేవకుని కర్తవ్యం యజమాని చెప్పిన పని చేయడమే. యజమాని సేవకునికి కృతజ్ఞతలు చెప్పుడు.అయినా సేవకుడు తు.చ తప్పక యజమాని మాట వినాలి. విఫలమైతే యజమాని పని నుండి తొలగిస్తాడు.క్రైస్తవ జీవితం గొప్ప బాధ్యతతో కూడిన జీవితం. ప్రతిఫలం ఆశించకుండా దైవ కార్యంలో ఉండాలి.దేవుని కృపను పొందడానికి ప్రాధాన్యతనివ్వాలి. దైవ సేవలోనే ఆనందించాలి. మనం చేసే మంచి పనికి దేవుడు మనకు కృతజ్ఞతలు చెప్పాలని ఆశిస్తామా? దేవుని అనుగ్రహం లేకుండా మనం ఏ పనైనా చేయగలమా? మనమే దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. జీవితంలో బాధ్యత లేకపోతే జీవితానికి అర్ధం ఉండదు.బహుమతి కోసం ఎదురుచూస్తూ,బాధ్యతలను నిర్వహించకూడదు.మన బాధ్యతలను మనం నిర్వహించి సేవకునిగా దేవుని దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. దేవుని ఆజ్ఞతోనే సమస్తం నడుస్తుంది.దేవుడు మనకు మన కర్తవ్యాన్ని బోధించాడు.మన పనిని మనం నిర్వహించడంలో నిమగ్నమై ఉండాలే కానీ ఈ పని చేయడం వలన నాకేం ప్రయోజనం అంటూ దైవ కార్యాలను నిర్లక్ష్యం చేయకూడదు.లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏముంటుంది. ఆత్మరక్షణకు అవసరమైన పనులను చేయాలి.ప్రభువే మనకు తోడుగా ఉంటాడు. మనం చేసే ప్రతి పని సఫలీకృతమైనప్పుడు అది దేవుని కృపగానే స్వీకరించాలి.అందులో మన గొప్పతనం ఏమీ లేదు.మన బాధ్యతను మనం నిర్వహించి దేవుని కార్యాన్ని నెరవేర్చాలి. మన జీవితాన్ని పరిశీలిస్తే చాలాసార్లు భయం వేస్తుంది. ప్రభువు బోధనలకు విరుద్ధంగా కనిపిస్తుంది.మనకు ఎలాంటి శిక్ష రాబోతుందోననే భయం ఆందోళనకు గురిచేస్తోంది.లోక ప్రమాణాలతో జీవిస్తే భయంభయంగానే జీవితం గడిపేయాలి.ప్రభువు అనుగ్రహంతో మన కార్యాలు నిర్వహించినప్పుడు భయపడవలసిన అవసరమే ఉండదు.తోటి వారికి సేవ చేయడం గొప్ప భాగ్యంగా భావించాలి.ఎలాంటి బహుమతి ఆశించకుండానే మంచిన కాంక్షించాలి.మంచిని చేయాలి, మంచిని పెంపొందించాలి.ఇది సాధ్యమేనా?

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN