ప్రజా సంక్షేమమే పాలకుల ప్రథమ కర్తవ్యం – పోప్
జోసెఫ్ అవినాష్
09 Nov 2026
పోప్ లియో XIV నవంబర్ 6 నుంచి 17 వరకు ఉరుగ్వే, అర్జెంటీనా,పెరూ దేశాల్లో 12 రోజుల అపోస్తోలిక ప్రయాణాన్ని చేపట్టారు.ఈ పర్యటనలో భాగంగా అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో ప్రభుత్వ అధికారులు,పౌర సమాజ ప్రతినిధులు, దౌత్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా పాలకులు తమ స్వప్రయోజనాల కంటే ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.అధికారం అనేది ప్రజలను పాలించడానికి కాకుండా వారికి సేవ చేయడానికి ఉపయోగపడాలని సూచించారు.పేదలు,వృద్ధులు, నిరుద్యోగులు,ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని,యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.అలాగే అవినీతి, మానవ అక్రమ రవాణా,మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రతి మానవ ప్రాణ గౌరవాన్ని కాపాడటంతోపాటు పర్యావరణ పరిరక్షణ,ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.భావితరాలకు ఐక్యమైన, సమైక్యమైన సమాజాన్ని అందించడం అందరి బాధ్యతని గుర్తుచేశారు.
