"దేవుని ఆలయం - భక్తుల హృదయమే"

జోసెఫ్ అవినాష్

08 Nov 2026

దేవుని ఆలయం అంటే దేవుడు ఉండే స్థలం.దేవుడు అంతటా ఉన్నాడు.ఆయన మన హృదయ నివాసి.మన హృదయంలో ఉన్నాడు. మనమే దేవుని ఆలయం. మనతో ఉండే వాడే దేవుడు. దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడానికి మనం నిర్మించుకున్న భౌతిక ఆలయాలు,మన జీవితానికి, ఐక్యతకు చిహ్నంగా ఉంది.ఈ రోజు మనం లాటరన్ మహాదేవాలయ ప్రతిష్టాత్సవాన్ని కొనియాడుచున్నాం.ఈ ఆలయం స్థానికంగా మన మధ్య ఉన్న ఆలయాల విశిష్టతను వివరిస్తుంది."నా ఆలయం అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడును" (మార్కు 11:17). దేవుని దివ్య తేజస్సు ఆలయంలో ప్రకాశించుటవలన ఆలయంలో ప్రవేశించే ప్రతి ఒక్కరి హృదయాలు దేవుని దివ్య తేజస్సుతో ప్రకాశిస్తాయి. ఆలయ సన్నిధిలోనే నెమ్మది, శాంతి,స్వస్థత పొందుతాం. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది.ఆ ఆలయాల నిర్మాణంలోని విశిష్టత కనిపిస్తుంది.శ్రీసభ తొలి నాళ్లల్లో,అనేక వేద హింసలు,విపరీతంగా ఉండేవి. ప్రార్ధనకు ఒక ప్రత్యేక ప్రదేశంలో గుమి కూడడం కష్టంగా ఉండేది.అలాంటి పరిస్థితుల్లో విశ్వాసులందరూ రహస్యంగా గృహాలలోనే గుమికూడి, ప్రార్ధనలో ఏకీభవించేవారు. దైవారాధన రహస్యంగానే నిర్వహించేవారు.దివ్య భోజనం రహస్యంగానే స్వీకరించేవారు. కొన్నిమార్లు భూగర్భంలో రహస్య స్థావరాల్లో నిర్వహించుకునేవారు.క్రైస్తవ విశ్వాస వ్యాప్తిని అడ్డుకున్నా విశ్వాసుల ఐక్యతను అడ్డుకోలేక పోయారు.ఆ తరువాత కాలంలో క్రీ.శ. 313 నుండి 337 వరకు రోము రాజ్యాధిపతిగా కాన్ స్టెంటైన్ పాలించాడు.ఆ కాలం క్రైస్తవ విశ్వాసులకు స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. రోము చక్రవర్తి లాటరన్ రాజభవనాన్ని దేవాలయంగా ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు.ఆ భవనమే పరిశుద్ధ లాటరిన్ బృహద్దేవాలయంగా క్రీ.శ. 324, నవంబర్ 9వ తేదీన, 1వ సిల్వెస్టర్ పోవుగారు ఆశీర్వదించి ప్రతిష్టించారు.పునీత బాప్తీస్మ యోహాను,సువార్తికుడైన పునీత యోహాను పేరిట ఈ ఆలయం నామకరణం చేయబడి పెద్ద దేవాలయంగా అంకితం గావించారు.కతోలిక దేవాలయాలు దేవుని కృపావరనిలయాలు.ఆలయంలో మనకు దివ్య సంస్కారాలు నిర్వహింపబడి దేవుని ప్రత్యక్షతను కళ్లారా చూసే భాగ్యం లభిస్తుంది.దేవుని వాక్కు ప్రకటింపబడి హృదయ పరివర్తనకు ఆహ్వానిస్తుంది. విశ్వాసుల సమూహంగా దేవాలయంలో గుమికూడి దేవుని ప్రజలుగా ఏకమనస్సులై ప్రార్థించే అవకాశం లభిస్తుంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN