దీపావళి శుభాకాంక్షలతో

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

08 Nov 2026

దీపాల పండుగ!
...........................

సీ:అవినీతి చీకట్ల నవనిలో పోకార్చ
నిత్యమూ వెలగాలి నీతి జ్యోతి!
తిమిరాల చెడుపైన సమరమే చేయుచూ
మంచినందరికిల పంచ మనుచు
పాలకులందరూ ప్రజల బ్రతుకులందు
నింపాలి వెలుగునే నిత్య మనుచు
'దీపావళి' యనెడి దీపాల పండుగ
కాంతుల వేడుకై కదలి వచ్చె

ఆ.వె:
బ్రతుకు నిండ నిండి పండుగ చేసెడి
వెలుగులన్ని యెపుడు మలిగి పోక
దీప పర్వ మందు దీప్తితో జ్వలించ
కలుగ వలయు మనకు కార్య సిద్ధి!
-అందరికీ దీపావళి శుభాకాంక్షలతో,

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN