పీఠాధిపతులు దైవ పిలుపుల కోసం ప్రార్థన, ఉపవాస దినాలు పాటించాలి: పోప్

జోసెఫ్ అవినాష్

07 Nov 2026

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలిక పీఠాధిపతులు తమ తమ విచారణల్లో గురుత్వ జీవితానికి, దైవార్పిత జీవితానికి మరింతమంది యువత ముందుకు రావాలని ప్రత్యేక ప్రార్థన, ఉపవాస దినాలను ఏర్పాటు చేయాలని పోప్ లియో XIV పిలుపునిచ్చారు.ఉరుగ్వే దేశంలోని మోంటెవీడియో కేథడ్రల్‌లో పీఠాధిపతులు,గురువులు, డీకన్లు, కన్యా స్త్రీలు, గురు విద్యార్థులతో కలిసి సాయంకాల ప్రార్థనలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.2024లో ఉరుగ్వేలోని అంతరపీఠాధిపతుల గురుశిక్షణా సంస్థకు కొత్త అభ్యర్థులు ఎవరూ రాకపోవడంతో అక్కడి విశ్వాసులు గురుత్వ, సన్యాస జీవితాలకు మరింతమంది ముందుకు రావాలని ప్రార్థన, ఉపవాసాలను ప్రారంభించారు.వారి నిరంతర ప్రార్థనల ఫలితంగా కొంతమంది యువత సెమినరీ, దైవార్పిత జీవితంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారని పోప్ గుర్తుచేశారు. ఈ అనుభవాన్ని ఆదర్శంగా తీసుకొని విచారణలు, కుటుంబాలు, మఠసభలు కూడా ఈ ప్రార్థనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. దేవుడు తన ప్రజల ప్రార్థనలను ఆలకిస్తాడనే విశ్వాసంతో ఈ ప్రార్థనలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN