బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆసియా క్రైస్తవ సంఘాల నేతల పిలుపు

జోసెఫ్ అవినాష్

06 Nov 2026

ఆసియాలో బాలల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, బలవంతపు శ్రమ వంటి అమానవీయ చర్యలను అరికట్టేందుకు క్రైస్తవ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 2026 అక్టోబర్ 20 నుంచి 23 వరకు థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్ నగరంలో క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆసియా (CCA) ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ సమావేశం జరిగింది.ఇందులో 30 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. బాలల రక్షణలో క్రైస్తవ సంఘాలు మరింత చురుకైన పాత్ర పోషించాలని,బాధిత బాలలకు ఆశ్రయం,విద్య,వైద్య, మానసిక సహాయం అందించాలని సూచించారు.పేదరికం, లింగ వివక్ష,సామాజిక అసమానతలు బాలల అక్రమ రవాణాకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు, క్రైస్తవ సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ బాలల హక్కులు, గౌరవం,భద్రతను కాపాడేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆసియా క్రైస్తవ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN