"యుక్తి ముక్తి"

జోసెఫ్ అవినాష్

05 Nov 2026

సామాన్య 31వ శుక్రవారం
సువిశేష ధ్యానం -:
లూకా 16:1-8
దేవుడు ప్రతి మనిషికి ఈ లోకంలో ఒక అంతస్తును ఏర్పాటు చేశాడు.ఆ అంతస్తుకు తగిన విధంగా జీవిస్తూ,మన భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టి, దేవుని చిత్త మెరిగి జీవించడం ఉత్తమ లక్షణం.ఈ లోకంలో జీవించడానికి ముందు చూపు చాలా అవసరం.ప్రణాళిక బద్ధంగా జీవించడం అవసరం. దేవుని మీద ఆధారపడడం అవసరం.అయితే ఈ లోక విషయాలలోనే మనం అశ్రద్ధ వహించినప్పుడు పరలోక సంబంధమైన విషయాలపై, మనం శ్రద్ధ ఎలా కనబరచగలం? ధనాన్ని ప్రేమించేవారు దైవాన్ని స్వీకరించలేరు.దైవాన్ని ప్రేమించే వారికి ధన సంపాదనపై అత్యాశ ఉండదు. ధనం దైవకార్యాలు చేయడానికి ఉపయోగించేవారు తమ జీవితాలను తాము పోషించుకుంటూ, దేవుని అనుగ్రహాన్ని చవిచూస్తూ, శ్రమిస్తూ,తోటి వారికి ఉపయోగకరంగా ఉంటారు. ధనాశాపరులకు తప్పదు. అన్యాయంగా సంపాదించినది ఒకరోజు పరుల పాలవుతుంది. న్యాయంగా ఆర్జించినది, దేవుని మహిమకై ఉపయోగిస్తారు.మనం అన్యాయంగా సంపాదించుకోకూడదు. అంతేకాదు దోచుకోవడం కూడా సబబు కాదు. నమ్మకపాత్రంగా జీవించడం ముఖ్యమే.దైవ భయం కలవారు యుక్తితో, నేర్పుతో, దైవాజ్ఞలకు లోబడి పనిచేస్తారు.మన జీవనోపాధిని మనం సంపాదించుకోవడం అవసరం.ఈ క్రమంలో తోటి వారి కడుపు కొట్టడం అన్యాయం. అన్యాయంగా మనతో పని చేయించుకునే వారితో చేతులు కలపడం దైవాజ్ఞలను ధిక్కరించిన వారిగా ఉంటాం. కాబట్టి శ్రమను గౌరవిస్తూనే మన జీవనోపాధికై కష్టపడాలి. తక్కువ వేతనం లభించిన న్యాయమైన మార్గంలో పనిచేయడం ఉత్తమం. జీవనోపాధి విషయంలో అవిశ్వాసులు ఎక్కువ యుక్తితో ఉన్నారు. విశ్వాసులు అందుకు భిన్నంగా ఉన్నారని యేసు శిష్యులతో అన్నాడు. మోసం చేయాలని యేసు చెప్పలేదు. కానీ అలాంటి పరిస్థితులలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ప్రభువు అనుగ్రహించిన సంపదలను తోటి వారితో పంచుకోడానికి ఉదారంగా ఉండాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN