డిజిటల్ యుగంలో మానవ గౌరవాన్ని కాపాడాలి – ఆర్చ్‌బిషప్ ఉడుమల బాల పిలుపు

సిస్టర్ A. రాజకుమారి (CSA)
05 Nov 2026
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత డిజిటల్ యుగంలో మానవ గౌరవం, నైతిక విలువలు,సామాజిక బాధ్యతలను కాపాడుకోవాలని విశాఖ అగ్ర పీఠాధిపతులు మహా.ఘన ఉడుమల బాల గారు పిలుపునిచ్చారు.నవంబర్ 5, 6 తేదీలలో హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేదాంతాచార్యులు ,గురువులు,కన్యా స్త్రీల సమావేశం జరిగింది.
“AI యుగంలో డిజిటల్ మార్పులు – పోప్ లియో XIV బోధనల ప్రాసంగికత” అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో వారు ముఖ్య ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించడం,తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, వ్యక్తిగత సమాచార భద్రతను కాపాడడం వంటి అంశాలపై చర్చిలు,పాఠశాలలు,కళాశాలలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.సాంకేతిక పరిజ్ఞానం మానవాళికి సేవ చేసే సాధనంగా ఉండాలే తప్ప,అది మనిషిని శాసించే స్థాయికి చేరకూడదని స్పష్టం చేశారు.ముఖ్యంగా పేదలు, రైతులు,గిరిజనులు,అణగారిన వర్గాల ప్రజలు డిజిటల్ అభివృద్ధి ఫలాలను పొందేలా శ్రీసభ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మానవ గౌరవం,సత్యం,న్యాయం,సమాజ ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ కృత్రిమ మేధస్సును మానవాళి శ్రేయస్సు కోసం వినియోగించుకోవాలని ఆయన సందేశమిచ్చారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఫాదర్ గోవా శౌరయ్య MSFS, ఫాదర్ ఆళ్ళ స్థాన్లీ గార్లు ఈ అంశంపై చక్కని సందేశాలను అందించారు.
