క్రీస్తునందు మన జీవితం విమోచించబడింది – పోప్

జోసెఫ్ అవినాష్

05 Nov 2026

మరణించిన వారి కోసం ప్రార్థించడం అనేది శ్రీసభ నిర్వర్తించాల్సిన ప్రాథమిక విధుల్లో ఒకటని పోప్ లియో XIV అన్నారు.నవంబర్ 5వ తేదీన వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికాలో గత ఏడాది మరణించిన ఏడుగురు కార్డినల్స్, 136 మంది పీఠాధిపతుల ఆత్మశాంతి కోసం సమర్పించిన దివ్యబలిపూజలో ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా మరణించిన వారి కోసం చేసే ప్రార్థనలు పునరుత్థానంపై మనకున్న విశ్వాసానికి,నిరీక్షణకు నిదర్శనమని వివరించారు. క్రీస్తునందు మన జీవితం నశించిపోలేదు,ఆయన ద్వారా విమోచించబడిందని గుర్తుచేశారు.మరణించిన వారి కోసం ప్రార్థించడం అంటే కేవలం గత జ్ఞాపకాలను తలచుకోవడం కాదని,అది జీవాన్ని సంబరంగా కొనియాడటమేనని అన్నారు. అలాగే,మరణాన్ని భయంతో కాకుండా విశ్వాసంతో ఎదుర్కోవాలని,ఎందుకంటే ప్రభువు సజీవంగా ఉన్నారని, తన తండ్రి గృహంలో మనకు స్థానం సిద్ధం చేశారని చెప్పారు. పునీతుల సమైక్యతను ప్రస్తావిస్తూ,మరణించిన వారి కోసం మనం ప్రార్థించడమే కాకుండా,వారితో కలిసి కూడా ప్రార్థిస్తున్నామని వివరించారు.క్రీస్తునందు మరణం మన మధ్య ఉన్న బంధాలను తెంచివేయదని,దేవుని ప్రేమలో వాటికి నూతన పరిమాణాన్ని ఇస్తుందని పోప్ స్పష్టం చేశారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN