అన్యాయాలను రూపుమాపి, ప్రజల గాయాలను మాన్పే రాజకీయాలే మానవాళికి ఆశనిస్తాయి – పోప్
జోసెఫ్ అవినాష్
05 Nov 2026
2026 నవంబర్ 4న వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన బుధవారం సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో XIV గారు మాట్లాడుతూ,క్రైస్తవులు తమ విశ్వాసానికి అనుగుణంగా ఆర్థిక,రాజకీయ రంగాల్లో బాధ్యతాయుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.నిరుద్యోగం,కార్మికుల దోపిడీ, ప్రాణాలకు ముప్పు కలిగించే పని పరిస్థితులు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు.పేదలు, వలసదారులు,బలహీన వర్గాలపై వివక్షను తొలగించాలని, ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం,ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.రాజకీయ వ్యవస్థ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని,మానవ హక్కులు,మానవ గౌరవాన్ని కాపాడాలని తెలిపారు.ప్రజల బాధలను తొలగించి, అన్యాయాలపై పోరాడే రాజకీయాలే మానవాళి భవిష్యత్తుకు ఆశను అందిస్తాయని పోప్ పేర్కొన్నారు.అంతేకాకుండా, సమాజ శాంతి,సమగ్ర అభివృద్ధి కోసం కతోలిక సంఘం మరియు రాజకీయ వ్యవస్థ పరస్పర సహకారంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
