నవంబర్ నెల ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్

జోసెఫ్ అవినాష్
04 Nov 2026
కతోలికులు నవంబర్లో ప్రార్థించాల్సిన ప్రార్థనా ఉద్దేశాన్ని జగద్గురువులు పోప్ లియో XIV ప్రకటించారు.సంపదను స్వార్థం కోసం కాకుండా,సమాజ శ్రేయస్సు కోసం,ముఖ్యంగా పేదలు,నిరుపేదలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయపడే విధంగా వినియోగించుకునేలా దేవుడు ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని,ఉదార హృదయాన్ని ప్రసాదించాలని ప్రార్థించమని ఆయన పిలుపునిచ్చారు.సంపదను కూడబెట్టుకోవాలనే స్వార్థపూరిత ఆలోచనలకు లోనుకాకుండా,మనకు ఉన్న ఆస్తి,డబ్బు,సమయం,ప్రతిభ వంటి వనరులను ఇతరుల మేలు కోసం ఉపయోగించాలని ఆయన కోరారు.సంపద కొద్దిమంది చేతుల్లోనే పరిమితం కాకుండా,అందరి అభ్యున్నతికి,సమాజంలో ఐక్యత, సమానత్వం, సోదరభావం పెంపొందించడానికి దోహదపడాలని ఈ నెల ప్రార్థనా ఉద్దేశం ద్వారా విశ్వాసులను ఆహ్వానించారు.
