మణిపూర్లో తాజా హింస.. క్రైస్తవ గిరిజన తెగల మధ్య శాంతి చర్చలకు ఆటంకం

జోసెఫ్ అవినాష్
03 Nov 2026
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్లో కుకీ,నాగ గిరిజన క్రైస్తవ సముదాయాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.అక్టోబర్ 31న గుర్తుతెలియని సాయుధ బృందాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ గిరిజనులు మరణించగా,అక్టోబర్ 28 నుంచి కనిపించకుండా పోయిన మరో ఇద్దరి మృతదేహాలు మరుసటి రోజు తీవ్రంగా ఛిద్రమైన స్థితిలో లభ్యమయ్యాయి.ఈ హత్యల వెనుక నాగ సాయుధ బృందాల హస్తం ఉందని కుకీ వర్గాలు ఆరోపించగా, నాగ వర్గాలు ఆ ఆరోపణలను ఖండించాయి.ఈ నేపథ్యంలో హత్యలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ జరపాలని కుకీ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పటికే 2023 మే నుంచి కొనసాగుతున్న మణిపూర్ జాతి ఘర్షణల్లో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా,సుమారు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు.తాజాగా కుకీ,నాగ సముదాయాల మధ్య చోటుచేసుకున్న హింస ఇరు వర్గాల మధ్య శాంతి నెలకొల్పేందుకు క్రైస్తవ నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర ఆటంకంగా మారింది.
