మరణించిన విశ్వాసులతో మన బంధం తెగిపోదు, అది క్రీస్తులో రూపాంతరం చెందుతుంది: పోప్
జోసెఫ్ అవినాష్
03 Nov 2026
2026 నవంబర్ 2, సోమవారం, సకల ఆత్మల మహోత్సవం సందర్భంగా పోప్ లియో XIV రోమ్‌లోని కాంపో వెరానో సమాధుల స్థలంలో దివంగత విశ్వాసుల కోసం ప్రత్యేక దివ్యబలిపూజను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,యేసుక్రీస్తు బోధించిన అష్ట భాగ్యాలను ఈ లోకంలోనూ,నిత్యజీవంలోనూ సంపూర్ణమైన జీవితాన్ని పొందడానికి మార్గమని తెలిపారు. ముఖ్యంగా దుఃఖించువారు ఓదార్పు పొందుదురనే ధన్యతా వాక్యాన్ని ప్రస్తావిస్తూ,తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కోసం,ముఖ్యంగా యుద్ధ హింసల కారణంగా ప్రియమైన వారిని కోల్పోయిన వారి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.ఆయుధాలను నిలిపివేయగల శక్తి ఉన్నవారి మనస్సాక్షిని తల్లుల కన్నీళ్లు తాకాలని ప్రార్థించారు.క్రీస్తుపై మనకున్న విశ్వాసం మరణించిన విశ్వాసులతో మనకున్న బంధాన్ని తెంచివేయదని, దానిని నూతన రూపంలోకి మారుస్తుందని పోప్ స్పష్టం చేశారు.
