సకల ఆత్మల పండుగ సందర్భంగా

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
02 Nov 2026
ఆత్మల పండుగ!
*************"**
సీ ;
ఆత్మల పండుగ అది వచ్చునేటేట
స్మరణము చేయగస్వర్గ జనుల
మరణము పొందును మనుషుల దేహమే
అంతము లేదంటు ఆత్మకెపుడు
సంప్రదాయకమైన సంబరాలను చేసి
ఉత్తరిం చెడి చోట నుత్తరించు
ఆత్మలకోసమై ఆ సమాధుల చేరి
జపములు చెప్పేటి చాల గొప్ప
తే,గీ ;
పండుగై యిది వచ్చును ప్రజలకెపుడు పారలౌకిక తలపులు ప్రబలజేసి పోయినోళ్ళను తలచుచు పూజ చేయు పరమ ప్రియమగు ఆత్మల పర్వ దినము !
