పునీతుల మాటల్లో జపమాల

జోసెఫ్ అవినాష్

31 Oct 2026

మనం అత్యంత పవిత్రంగా ఆచరించే దివ్యపూజాబలి తర్వాత అత్యంత మహా శక్తివంతమైన ప్రార్థన జపమాల ప్రార్థన.‌. జపమాల ప్రార్థన దేవుని తల్లియైన మరియతల్లి ద్వారా పునీత దోమినిక్ గారికి విశ్వ శ్రీ సభ యావత్ ప్రపంచ రుగ్మతలతో విరుగుడుగా సైతాను శక్తి గాయాలు బంధింపబడుటకు మరియతల్లి స్వహస్తాల ద్వారా ఇవ్వబడినది.. మన పునీతులు జపమాలను ప్రేమించి, హృదయంలో ధరించి,విశ్వాసముతో స్మరించి పుణ్య జీవితం గడిపారు.. మనము కూడా విశ్వాసముతో జపమాలను స్మరించాలి..కొంతమంది పునీతుల మాటలలో జపమాల ఔన్నత్యాన్ని తెలుసుకుందాం-:

..నాకు సైన్యాన్ని ఇవ్వండి.కేవలం "జపమాల" అనే ఆయుధముతో ఈ ప్రపంచాన్ని జయిస్తాను-: 9వ పయస్ పోపు గారు.

... శోధనలకు, ప్రలోభాలకు గురైన ప్రతిసారీ మంగళవార్తను జపించడం వలన విజయం మనల్ని వరిస్తుంది-: పునీత జాన్ బోస్కో
... జపమాల నాకు చాలా ప్రీతికరమైన ప్రార్థన. అద్భుత వరప్రసాదాల గని,ఈ ప్రార్థనలో అతి దూత గాబ్రియేలు, మరియతల్లి బందువు ఎలిజబేతమ్మ నుండి విన్న వందన వచనాలు మనం మళ్ళీ మళ్ళీ పునరావృతం చేసే ప్రార్థన -: పునీత జాన్ పాల్ పాపు గారు.

...తన పవిత్ర గర్భంలో క్రీస్తు నాధునికి చోటివ్వడం మరియతల్లి చేసుకున్న మహా అద్భుత సంకల్పం. కాబట్టి తన తల్లి ప్రార్థనలు క్రీస్తుకు మహా ఆనందాన్ని కలిగిస్తాయి.ఎందుకంటే ఆమె మన తరుపున ప్రార్థించే ప్రతి మనవిని తప్పక తీర్చాలని కోరుకుంటారు...

...అత్యంత ఉన్నతమైన ప్రార్థన అంటే జపమాల ప్రార్థన-: పునీత ఫ్రాన్సిస్ డె సాలెస్

..జపమాల ప్రార్థించడమంటే క్రీస్తు మరియు మరియతల్లి కరుణ గల హృదయాలకు మన భారములను అప్పజెప్పుట- పునీత 2వ జాన్ పాల్

... ప్రతిరోజు జపమాలను జపించే కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తుంది - పునీత 2వ జాన్ పాల్ జగద్గురువులు

.... ప్రపంచ శాంతి కొరకై ప్రతిరోజు జపమాలను ప్రార్థించండి- ఫాతిమామాత

...జపమాల సైతానును ఎదిరించే నా శక్తివంతమైన ఆయుధం- పునీత పాద్రెపియో

...జపమాల ప్రార్థనే ఒకరోజు ఈ లోకాన్ని రక్షిస్తుంది- పునీత డొమినిక్

...జపమాల ప్రార్థనలో "పరిశుద్ధ మరియమ్మ"! అని మీరు పిలిచినప్పుడు వెంటనే నిన్ను ఆలకించి మరియతల్లి నీతో మాట్లాడుతుంది- పునీత సియోన్న బెర్నార్దాన్

...పరిపూర్ణ భక్తి,విశ్వాసాలతో వినయముతో,నమ్మకముతో, పట్టుదలతో జపమాలను ప్రార్థించండి విజయం మీ సొంతం- పునీత లూయిస్ ది మోంట్ ఫోర్ట్

చివరిగా-:
పునీతులు జపమాలను ప్రేమించారు,విశ్వసించారు, హృదయంతో ధ్యానించారు, శోధనలను జయించారు పుణ్య జీవితం జీవించారు. మనము కూడా జపమాలను ప్రేమిద్దాం, విశ్వసిద్దాం మంచి జీవితాన్ని జీవిద్దాం ఆ మరియతల్లి ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తారు...

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN