స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం – మృతుల కుటుంబాలకు పోప్ లియో XIV సంతాపం
జోసెఫ్ అవినాష్
30 Oct 2026
స్పెయిన్‌లోని మధ్య ప్రాంతంలో బుధవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టోలెడో ప్రావిన్స్‌లోని ఉర్డా పట్టణం సమీపంలో ఉదయం 8:54 గంటల సమయంలో రెండు అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.ఈ విషాద ఘటనపై పోప్ లియో XIV తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అలాగే సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది తమ సేవలను మరింత పట్టుదలతో కొనసాగించాలని ప్రోత్సహిస్తూ, వారికి తన అపోస్తలిక ఆశీర్వాదాన్ని అందించారు.ఈ ప్రమాదం నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. గురువారం నాటికి 53 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
