విశ్వాసం ప్రతి సంస్కృతిని సుసంపన్నం చేస్తుంది - పోప్
జోసెఫ్ అవినాష్
29 Oct 2026
బుధవారం జనరల్ ఆడియన్స్ సందర్భంగా ద్వితీయ వాటికన్ మహాసభ పత్రం గౌదియుం ఎట్ స్పెస్ (Gaudium et Spes) ఆధారంగా తన బోధనలను కొనసాగించిన పోప్ లియో XIV, విశ్వాసానికి,సంస్కృతికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు.కతోలిక సంఘం సువార్తను ప్రకటించడంతోపాటు విద్యాసంస్థలను స్థాపించి, ప్రజల మానవీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వికాసానికి ఎల్లప్పుడూ కృషి చేసిందని పోప్ గుర్తుచేశారు. విశ్వాసం ప్రపంచ సంస్కృతులకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని, వాటిలోని మంచిని, సత్యాన్ని, సౌందర్యాన్ని స్వీకరిస్తూ క్రీస్తు ప్రేమ, సేవా భావం ద్వారా వాటిని సుసంపన్నం చేయాలని ఆయన పేర్కొన్నారు.
క్రైస్తవులు విశ్వాసంలో ఎదుగుతూనే తమ మేధోపరమైన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలని పోప్ పిలుపునిచ్చారు. ప్రపంచ సంస్కృతుల పట్ల వ్యతిరేకతతో కాకుండా, వాటిని అర్థం చేసుకుంటూ క్రీస్తు బోధనలకు అనుగుణంగా జీవించడం ద్వారా తమ విశ్వాసానికి నమ్మకమైన సాక్షులుగా నిలవాలని సూచించారు.“విశ్వాసం తాను ఎదుర్కొనే ప్రతి సంస్కృతిని సుసంపన్నం చేసి, దాని పరిపూర్ణతకు తోడ్పడుతుంది. అదే సమయంలో, క్రీస్తు ద్వారా రూపుదిద్దుకున్న సంస్కృతిగా విశ్వాసం కూడా మారాలి” అని పోప్ లియో XIV వివరించారు.
