అర్నబ్ తుఫాను - అందరికీ మిగిల్చినకన్నీరు!

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
29 Oct 2026
అర్నబ్ తుఫాను - అందరికీ
మిగిల్చినకన్నీరు!
.............................................................
ఆంధ్రాను అతలాకుతలం చేసిన తుఫాను,
కోస్తాంధ్ర ప్రజలను గజగజలాడించిన తుఫాను!
కోనసీమ పచ్చదనాన్ని కకావికలం చేసి,
రైతన్నల పంట ఆశలను నేలపాలు చేసిన తుఫాను!
ఈదురు గాలులకు ఆరిపోయె రైతన్న ఆశాదీపాలు,
కుండపోత వానలకు మునిగిపోయె పంటపొలాలు!
కష్టపడి పండించిన పంటంతా నీటిపాలై,
కన్నీటితో నిండిపోయె అన్నదాతల కళ్లలోని కలలు!
నామరూపాలు లేకుండా
కొట్టుకుపోయిన ఇల్లు
సర్వం కోల్పోయిన వారి ఆక్రందన అంతులేనిది
త్రాగు నీరు, పట్టెడన్నంకై ఎదురుచూపులు
విద్యుత్ స్తంభాలు విరిగి
కమ్మిన చిమ్మ చీకట్లు.
ఇవన్నీ ఎవరు చేసిన పాపాలు?
ప్రకృతి ప్రకోపానికి బలైన పేదల గోడులు!
ప్రభుత్వాలపై ప్రశ్నలెన్నో సంధించే వేళ,
ప్రజలంతా మేల్కొని సరిచేసుకోవాలి లోపాలు!
రైతన్న కష్టమే దేశానికి వెన్నెముక,
అన్నదాత కన్నీరు తుడవడమే మనందరి బాధ్యత!
పంట నష్టాలకు పరిహారం అందించాలి,
బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలి!
ప్రభుత్వ పెద్దలారా, ప్రజాప్రతినిధులారా,
ధనవంతులారా, దాతృత్వ హృదయులారా!
తుఫాను బాధితులను ఆదుకోవడానికి రండి,
ఆకలితో అలమటించే కుటుంబాలకు అండగా నిలవండి!
కులమత భేదాలు మరచి చేతులు కలుపుదాం,
కష్టాల్లో ఉన్న మన సోదరులను ఆదుకుందాం!
రైతన్న మళ్లీ నవ్వేలా చేయడమే మన లక్ష్యం,
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే మనందరి సంకల్పం!
ఇదే సమయం… ఇదే సమయం… ఇదే సమయం!
బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే సమయం!
అన్నదాత కన్నీటిని తుడిచే సమయం!
మానవత్వపు దీపాలను వెలిగించే సమయం!
*జై కిసాన్! జై మానవత్వం!*
