లైంగిక వేధింపులకు గురైన బాధితులను కలవనున్న పోప్
జోసెఫ్ అవినాష్
28 Oct 2026
2026 నవంబర్ 6 నుంచి 17 వరకు ఉరుగ్వే, అర్జెంటీనా,పెరూ దేశాల్లో పర్యటించనున్న పోప్ లియో XIV, కతోలిక గురువులు, సంఘ సభ్యుల చేత లైంగిక వేధింపులకు గురైన బాధితులను కలుసుకోనున్నారు.బాధితుల ఆవేదనను ఆలకించి,వారికి తన సంఘీభావాన్ని తెలియజేయడం,వారి గాయాలు మానేందుకు తోడ్పడటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం.బాధితులకు న్యాయం,స్వస్థత చేకూరేలా కృషి చేయడంతోపాటు,సువార్తను జీవిస్తూ ప్రకటించే సురక్షితమైన, ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరమైన ప్రదేశంగా కతోలిక సంఘం నిలవాలని పోప్ ఆకాంక్షిస్తున్నారు.గతంలో స్పెయిన్,ఫ్రాన్స్ పర్యటనల సందర్భంగా కూడా ఆయన వేధింపులకు గురైన బాధితులను కలిసి వారి వేదనను ఆలకించారు.
