యుద్ధ బాధిత ఉక్రెయిన్ ప్రజలకు వాటికన్ సహాయం
జోసెఫ్ అవినాష్
27 Oct 2026
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయం అందించేందుకు వాటికన్ ముందుకొచ్చింది.చలికాలంలో వారికి అవసరమైన దుస్తులు, దుప్పట్లు,ఆహార పదార్థాలను సేకరించి సుమారు 600 పెట్టెల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేసింది.ఇప్పటికే నాలుగు ట్రక్కుల నిండా,సుమారు రెండు కోట్ల యూరోల విలువైన ఔషధాలను కూడా ఉక్రెయిన్‌కు పంపించింది.పాపు గారి దాతృత్వ సేవల ప్రతినిధి ఆర్చ్‌బిషప్ లూయిస్ మారిన్ డి సాన్ మార్టిన్ అక్టోబర్ 27 నుంచి 30 వరకు ఉక్రెయిన్‌లో పర్యటించి, యుద్ధ బాధితులను పరామర్శించనున్నారు.బాధల్లో ఉన్నవారికి ఆచరణలో సహాయం చేయడం క్రైస్తవ ప్రేమకు నిదర్శనమని వాటికన్ తన సేవల ద్వారా చాటిచెబుతోంది.
