దేవుని రాజ్య స్థాపన కోసం కృషి చేద్దాం

జోసెఫ్ అవినాష్

27 Oct 2026

సామాన్య 30వ మంగళవారం
సువిశేష ధ్యానం -:
లూకా 13:18-21
ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తుప్రభువు 'ఆవగింజ' ఉపమానం తెలియజేస్తున్నారు. ఈ ఉపమానంలో యేసు ప్రభువు పరలోక రాజ -అద్భుతమైన అభివృద్ధిని ఊహించి, ఇది చాలా చిన్నది, కానీ అది పది అడుగుల ఎత్తువరకు పెద్ద పొదగా పెరుగుతుంది. దీని ముఖ్యోద్దేశం "దేవుని "రాజ్యంతో" పోలియున్నది అని వెల్లడిస్తున్నారు.

అవగింజ ఉపమానాన్ని దేవుని రాజ్యంతో ప్రభువు పోల్చారు. ప్రభువు రాకడ దైవరాజ్య నిర్మాణానికి పునాది. ఆవగింజను మనము మట్టిలో నాటినప్పుడు చాలా విశాలంగా,విస్తారంగా ఎదుగుతుంది.కొమ్మలతో విశాలంగా ఎదిగినప్పుడు దాని కొమ్మలలో ఆకాశపక్షులు నివాసం ఏర్పాటు. చేసుకుంటాయి.ఆవగింజ పెరిగి ప్రపంచంలో వున్న అన్ని జీవరాశులకు ఒక సహాయకారిగా,నివాసంగా చోటు కల్పిస్తుంది.ఆదే విధంగా దైవరాజ్యం కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది. క్రీస్తు అనబడు వ్యక్తి ముందు తెలియక పోయినా చివరికి ఆయన ఒక మహా వృక్షంగా ఈ లోకానికి తెలియచేయబడచాడు.

ఆవగింజను, గింజ అనటమే గొప్ప.ఇది అతి చిన్నగింజ. పెరిగి చెట్టుకావడం ప్రతి ఒక్కరికి ఒక మహావృక్షంలా ఉండటం గొప్ప.అదే -విధంగా దేవుని రాజ్యం కూడా మానవాళి అంతటికి నివాసమని తెలియపరుస్తుంది. దేవుని రాజ్యం చిన్న పరిమాణంలో ప్రారంభమై మహా వృక్షంగా పరిణితి చెంది విశ్వమంతా వ్యప్తి చెందింది. కాబట్టి ఆవగింజను మనం కొట్టిపడేయక మన అనుదిన జీవితాలలో దేవుని రాజ్య స్థాపన కోసం కృషి చేద్దాం. మరియు మన కుటుంబాలకు రక్షణను చేకూర్చుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN