పాదువ పుర స్వామి ప్రణతి సేతు!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
26 Oct 2026
తన ప్రార్ధనా మాధ్యమం ద్వారా దైవ భక్తులు కోరిన కోర్కెలు తీర్చి, వరములు కురిపించే మహిమాన్వితుడు పునీత అంతోని వారు!
వారి ద్వారా చేసే ప్రార్ధనలు తక్షణ ఫలితాన్నిస్తాయని మన కతొలిక క్రైస్తవుల ప్రగాఢమైన విశ్వాసం!
ఆయన అద్భుతాలు చేసే అర్చ్యశిష్టుడు!
పారవేసుకున్న వస్తువులను తిరిగిపొంద జేసే దైవ భక్తుడు!
దేవుని వద్ద మన మొరలను వినిపించి మేలు చేయగల ధీశక్తి వంతుడు!
ఆ అంతోని వారికి ప్రత్యేకించ బడిన మంగళవారం రోజున వారికి నీరాజనం
